Home /News /movies /

NITHIN VAKKANTHAM VAMSI MOVIE FORMERLY LAUNCHED PICS GOES VIRAL SR

Nithiin : వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్.. లాంఛనంగా ప్రారంభం..

Nithin Vakkantham Vamsi movie launched Photo : Twitter

Nithin Vakkantham Vamsi movie launched Photo : Twitter

Nithiin | యువ హీరో నితిన్ గతేడాది మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా అలరించలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన   ‘మాస్ట్రో’ (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే నితిన్‌ వరుసగా సినిమాలను చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Nithiin | యువ హీరో నితిన్ గతేడాది మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా అలరించలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన   ‘మాస్ట్రో’ (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే నితిన్‌ వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన వక్కంతం వంశీ (Vakkantham vamsi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. నితిన్‌కు 32 వ చిత్రంగా వస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటించనున్నారు. ఇక ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇక నితిన్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నితిన్ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

    ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా కేథరిన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జూలై 8న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నితిన్ బర్త్ డే సందర్భంగా  ప్రకటించారు.


    ఇక నితిన్ మాస్ట్రో విషయానికి వస్తే.. హీరో నితిన్ మాస్ట్రో (Nithiin Maestro)అనే థ్రిల్లర్‌ హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో తమన్నా విలన్ పాత్రలో నటించారు.  ఇక ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం క్లైమాక్స్, లవ్ ట్రాక్ మరియు నితిన్ (Nithiin) పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించారు. ఇక ఒరిజినల్‌ అంధాధున్‌‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Macherla Niyojakavargam, Nithiin, Tollywood news

    తదుపరి వార్తలు