హీరో నితిన్ పెళ్లి పీటలు ఎక్కుదామని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో కరోనా రావడంతో ఆయన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. నితిన్ ఇటీవల తన గర్లఫ్రెండ్ శాలినితో నిశితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పెళ్లిని ఘనంగా చేసుకోవాలనీ భావించిన నితిన్ మొదట దుబాయ్ లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని భావించాడు. అయితే కరోనా కారణంగా అలా వేసుకున్న ప్లాన్ ముందుకుసాగలేదు. ఇక చేసేందేం లేక నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ తన పెళ్ళిని డిసెంబర్లో చేసుకోనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వివాహం హైదరాబాద్ లో వధువు ఇంటి వద్దే జరుగునుందట. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దేలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయనకు జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్టైనా అంధాధున్ తెలుగు రీమేక్‌లో కూడా నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.