హోమ్ /వార్తలు /సినిమా /

నితిన్ ఫ్లాప్ మూవీ... అక్కడ మాత్రం అదుర్స్

నితిన్ ఫ్లాప్ మూవీ... అక్కడ మాత్రం అదుర్స్

నితిన్

నితిన్

తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నితిన్ ఛల్ మోహనరంగ మూవీని ‘అఆ2’ పేరుతో హిందీతో డబ్ చేశారు.

మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేస్తే పెద్దగా విజయవంతం కావేమో కానీ... అదే హిందీ వర్షన్‌లో యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే తెలుగులో పెద్దగా విజయాలు సాధించలేకపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి హీరోల సినిమాల హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ జాబితాలో అనేకమంది హీరోలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాసి హిందీ వర్షన్ మూవీ కూడా యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్ రాబట్టింది. తాజాగా ఈ విషయంలో నితిన్ ఫ్లాప్ మూవీ కొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నితిన్ ఛల్ మోహనరంగ మూవీని అఆ2 పేరుతో హిందీతో డబ్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమాను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. నితిన్ పాత సినిమాల ట్రాక్ రికార్డ్ కారణంగా...అఆ2 సినిమాకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్ రావడం విశేషం. ఒక్క రోజులోనే ఈ స్థాయిలో వ్యూస్ రావడంతో... ఈ మూవీ లాంగ్ రన్‌లో పది కోట్లకు పైగా వ్యూస్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. నితిన్ నటించిన అఆ, లై సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్‌లు కూడా యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించాయి.

First published:

Tags: Bollywood, Nithiin, Youtube

ఉత్తమ కథలు