రష్మిక మందన్న తోడుగా ‘భీష్మ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నితిన్..

కంటెంట్ ఎలాగున్నా సినిమా టైటిల్ మాత్రం క్యాచీగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు నితిన్. అందుకే ఆయన సినిమాల పేర్లు రోటిన్‌కి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వెరైటీ టైటిల్‌తోనే సినిమా చేస్తున్నాడు నితిన్. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

news18-telugu
Updated: June 12, 2019, 1:06 PM IST
రష్మిక మందన్న తోడుగా ‘భీష్మ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నితిన్..
నితిన్,రష్మిక మందన్న జోడిగా ప్రారంభమైన ‘భీష్మ’
  • Share this:
కంటెంట్ ఎలాగున్నా సినిమా టైటిల్ మాత్రం క్యాచీగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు నితిన్. అందుకే ఆయన సినిమాల పేర్లు రోటిన్‌కి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వెరైటీ టైటిల్‌తోనే సినిమా చేస్తున్నాడు నితిన్. ‘భీష్మ’ అని టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమాకి ‘సింగిల్ ఫర్ ఎవర్’ అనేది ట్యాగ్ లైన్. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండే భీష్ముడి తరహా పాత్రను నితిన్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ‘మన్మథుడు’ టైపులో వెరైటీగా ఉండి, జనాలను ఆకట్టుకుంటుందని అంటున్నారు.నాగశౌర్యతో ‘ఛలో’ వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా ‘భీష్మ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సింగిల్ ఫర్ ఎవర్ అనేది ఉపశీర్షిక.

Nithin, Rashmika Mandanna Bheeshma Movie starts by pooja ceremony,nithiin twitter,nithiin rashmika mandanna bheeshma shooting start,rashmika madanna,rashmika mandanna twitter,rashmika mandanna instagram,nithin twitter,nithiin venky kudumula Bheeshma movie,nithiin bheeshma first look,happy birth day nithiin,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,nithin chandrasekhar yeleti movie,nithiin chandrasekhar yeleti movie,nithiin bheeshma movie,nithin bheeshma movie,nithiin venky kudumula,nithiin venky kudumula rashmika mandanna,nithiin ramesh varma movie,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,నితిన్,నితిన్ ట్విట్టర్,నితిన్ భీష్మ ఫస్ట్ లుక్,నితిన్ వెంకీ కుడుముల భీష్మ,వెంకీ కుడుముల నితిన్ భీష్మ రష్మిక మందన్న, నితిన్ చంద్రశేఖర్ యేలేటి,నితిన్ రమేష్ వర్మ,నితిన్ భీష్మ సినిమా,నితిన్ వెంకీ కుడుముల సినిమా
నితిన్ ‘భీష్మ’ ఫస్ట్ లుక్


మహాభారతంలో భీష్ముడిలా బ్రహ్మచారిలా ఉండాలనుకునే ఒక కుర్రాడి కథ ఇది. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే అతని మది నిండా అమ్మాయిలు ఉన్నట్టు చూపించారు.  చూస్తుంటే ఆధునిక భీష్ముడి టైపు క్యారెక్టర్ అన్నమాట. అనుభవించు రాజా టైపు పాత్ర అన్నట్టు భీష్మ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. అమ్మాయిలతో తిరుగుతాడు.కానీ పెళ్లి మాత్రం నో అని చెప్పే మాడ్రన్ భీష్మ క్యారెకర్ట్ అని ఈ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది.ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్‌తో పాటు రష్మిక మందన్న‌తో పాటు దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ చిత్రానికి మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈ నెల 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 12, 2019, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading