NITHIN MACHERLA NIYOJAKAVARGAM RELEASE DATE POSTPONED HERE ARE THE DETAILS SR
Nithiin : వాయిదా పడిన నితిన్ మాచర్ల నియోజకవర్గం.. కొత్త విడుదల తేది ఇదే..
NIthiin Photo : Twitter
Nithiin : నితిన్ వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది.
Nithiin | యువ హీరో నితిన్ (Nithiin) గతేడాది మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా అలరించలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘మాస్ట్రో’ (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే నితిన్ వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదల ఎప్పుడు కానుందో టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం ఆగష్టు 12, 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. అయితే అదే రోజున సమంత నటిస్తున్న యశోద, అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ కూడా విడుదలకానున్నాయి. అయితే ఈ సినిమాను మొదట జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేథరిన్ ట్రెస్సా, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Krithi Shetty) నితిన్ (Nithiin) సరసన హీరోయిన్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో పాటు నితిన్, వక్కంతం వంశీ (Vakkantham vamsi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. నితిన్‌కు 32 వ చిత్రంగా వస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటించనున్నారు. ఇక ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
Date lo change anthe ⚠️
Collector Saab Action lo kaadhu 😎
ఇక నితిన్ మాస్ట్రో విషయానికి వస్తే.. హీరో నితిన్ మాస్ట్రో (Nithiin Maestro)అనే థ్రిల్లర్ హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో తమన్నా విలన్ పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్, లవ్ ట్రాక్ మరియు నితిన్ (Nithiin) పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించారు. ఇక ఒరిజినల్ అంధాధున్‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.