Nithin Check : చివరి షెడ్యూల్‌లో నితిన్ చెక్.. హైదరాబాద్‌లో షూటింగ్..

Nithin Check : ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపిస్తాడట. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.

news18-telugu
Updated: October 18, 2020, 6:58 AM IST
Nithin Check : చివరి షెడ్యూల్‌లో నితిన్ చెక్.. హైదరాబాద్‌లో షూటింగ్..
నితిన్ చెక్ పోస్టర్ Photo : Twitter
  • Share this:
యువ హీరో నితిన్ వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్న నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలు వాయిదా పడింది. అంతే కాదు ఎప్పుడో జూలైలో విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడంతో రంగ్ దే టీమ్ ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టి.. కంప్లీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ రెస్యూమ్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకానుంది.

ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చెక్‌’ అనే పేరును ఖరారు చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపిస్తాడట. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''చదరంగం నేపథ్యంలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథతో చిత్రం రూపొందుతోంది. నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. చంద్రశేఖర్‌ యేలేటి చాలా విభిన్నంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నితిన్‌, రకుల్‌, సాయి చంద్‌, సంపత్‌ రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌ నవంబర్‌ 5వ తేదీ వరకూ కొనసాగుతుంది. దీంతో చిత్రీకరణ పూర్తవుతుందన్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌, హర్షవర్థన్‌, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సినిమాతో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది.
Published by: Suresh Rachamalla
First published: October 18, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading