Nithin | Pawan Kalyan : సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న నితిన్.. పవన్ కళ్యాణే కారణమా..

నితిన్ పవన్ కళ్యాణ్ (nithiin pawan kalyan)

Nithin | యువ హీరో నితిన్ వరుస పరాజయాల తరువాత ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు.

 • Share this:
  యువ హీరో నితిన్ వరుస పరాజయాల తరువాత ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు. భీష్మ హిట్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రం రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎప్పుడో జూలైలో విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ రెస్యూమ్ చేసిన తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేసింది.  అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ చిత్రాలు ఉన్నాయి. దీంతో కొంత తగ్గినట్లు అనిపిస్తోంది. మిగతా సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశాయి. కానీ రంగ్ దే చిత్రబృందం నుంచి ఆ వైబ్రేషన్స్ లేవు. మరి ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలా అన్న డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారో చూడాలి. మరోవైపు తన అభిమాన నటుడు పవన్ కళ్యాన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతుండడంతో ఆయనకు పోటీగా ఎందుకు అన్నట్లు తన సినిమా విడుదలను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరోమాట ఏంటంటే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు..  ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా ఉగాదికి విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ నిర్ణయానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.  కొన్ని రోజుల క్రితమే థియేటర్స్ తెరవడంతో పెద్దగా జనాలు ఆసక్తి చూపించకపోవడం, దీనికి తోడు సంక్రాంతి బరిలో చాలా సినిమాలను నిలవడంతో సింగిల్ రిలీజ్ కోసం రంగ్ దే బృందం ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తోంది.

  ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.  సినిమా టీమ్‌పై నమ్మకంతో ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం అందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తుండడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది.

  ఇక ‘రంగ్ దే’ సినిమాతో పాటు నితిన్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాకు చెక్ అనే టైటిల్‌ను ఖారారు చేసింది చిత్రబృందం.   సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందుకే ఆ టైటిల్ పెడుతున్నారని తెలుస్తోంది. ఎలాగూ యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి కాబట్టి.. ఇక ఈ సినిమా కూడా అలాగే మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుందట. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నితిన్‌కు జోడిగా నటిస్తున్నారు. వీటితో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమాలతో పాటు నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ కూడా చేస్తున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published: