Nithin-Keerthy Suresh : షూటింగ్ షురూ చేసిన రంగ్ దే టీమ్.. సంక్రాంతి బరిలో నితిన్..

లోకేషన్‌లో రంగ్ దే టీమ్ Photo : Twitter

Nithin : వరుస పరాజయాల తరువాత భీష్మతో మంచి హిట్ అందుకున్న నితిన్.. రంగ్ దేతో రాబోతున్నాడు.

  • Share this:
    యువ హీరో నితిన్ వరుస పరాజయాల తరువాత ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు. భీష్మ హిట్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రం రంగ్ దే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రంగ్ దే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు.

    కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అంతే కాదు ఎప్పుడో జూలైలో విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడంతో రంగ్ దే టీమ్ షూటింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ రెస్యూమ్ చేసిన తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేస్తోందట. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.


    ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రెండు షెడ్యూల్ లు కూడా పూర్తి చేసుకుంది. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నితిన్‌కు జోడిగా నటిస్తున్నారు. వీటితో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది.
    Published by:Suresh Rachamalla
    First published: