Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Nithin : పవన్ కళ్యాణ్‌కు పోటీగా నితిన్.. సంక్రాంతి బరిలో రంగ్ దే..

    Nithin : ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్ ఉన్నాయి. దీంతో ఈ సారి కూడా పండుగ సీజన్ అదిరిపోనుందన్నమాట.

    news18-telugu
    Updated: October 4, 2020, 6:56 AM IST
    Nithin : పవన్ కళ్యాణ్‌కు పోటీగా నితిన్.. సంక్రాంతి బరిలో రంగ్ దే..
    Photo : Twitter
    • Share this:
    యువ హీరో నితిన్ వరుస పరాజయాల తరువాత ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు. భీష్మ హిట్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రం రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. సినిమా టీమ్‌పై నమ్మకంతో ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం అందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తుండడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

    అంతే కాదు ఎప్పుడో జూలైలో విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడంతో రంగ్ దే టీమ్ షూటింగ్ తిరిగి మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ రెస్యూమ్ చేసిన తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేస్తోందట. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్ ఉన్నాయి. దీంతో ఈ సారి కూడా పండుగ సీజన్ అదిరిపోనుందన్నమాట. ఇక ‘రంగ్ దే’ సినిమా తరువాత వెంటనే చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేస్తోన్న సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశాడట నితిన్. ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారైంది. సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందుకే ఆ టైటిల్ పెడుతున్నారని తెలుస్తోంది. ఎలాగూ యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి కాబట్టి.. ఇక ఈ సినిమా కూడా అలాగే మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుందట.

    ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నితిన్‌కు జోడిగా నటిస్తున్నారు. వీటితో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమాలతో పాటు నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ కూడా చేస్తున్నాడు.
    Published by: Suresh Rachamalla
    First published: October 4, 2020, 6:56 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading