నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

nithin marriage : యువ హీరో నితిన్  నాలుగేళ్లు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి పీటలు ఎక్కుదామని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో కరోనా రావడంతో ఆయన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 1, 2020, 12:54 PM IST
నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
షాలినీతో నితిన్ Photo : Twitter
  • Share this:
యువ హీరో నితిన్  నాలుగేళ్లు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి పీటలు ఎక్కుదామని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో కరోనా రావడంతో ఆయన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నితిన్ ఇటీవల తన గర్లఫ్రెండ్ శాలినితో నిశ్చి తార్థం చేసుకున్నాడు. ఇక పెళ్లిని ఘనంగా చేసుకోవాలనీ భావించిన నితిన్ మొదట దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాలని భావించాడు. అయితే క‌రోనా కారణంగా అలా వేసుకున్న ప్లాన్ ముందుకుసాగలేదు. ఇక చేసేందేం లేక నితిన్ త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం నితిన్ త‌న పెళ్ళిని ఈ నెల 26న చేసుకోనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ వివాహం హైదరాబాద్‌ లో వధువు ఇంటి వద్దే జరుగునుందట.

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దేలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయనకు జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్టైనా అంధాధున్‌ తెలుగు రీమేక్‌లో కూడా నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది.
First published: July 1, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading