Nithin : భీష్మ దర్శకుడికి భారీ బహుమతినిచ్చిన నితిన్..

Nithin : నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన సినిమా భీష్మ. సమ్మర్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

news18-telugu
Updated: September 9, 2020, 11:23 AM IST
Nithin : భీష్మ దర్శకుడికి భారీ బహుమతినిచ్చిన నితిన్..
కారుతో నితిన్, వెంకీ Photo : Twitter
  • Share this:
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన సినిమా భీష్మ. సమ్మర్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి బన్నీ అల.. వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు హిట్స్ తర్వాత ఫిబ్రవరి 21న విడుదలైన భీష్మ ఘన విజయాన్ని సాధించింది. నితిన్  ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. తన కెరీర్లో మంచి హిట్ ఇచ్చాడన్న అభిమానంతో సెప్టెంబర్ 8న తన దర్శకుడు వెంకీ పుట్టినరోజు సందర్భంగా నితిన్ భారీ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబందించిన ఓ ఫోటోను నితిన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని వెంకీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 'మంచి మనసున్న వ్యక్తితో మంచి సినిమా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నా పుట్టినరోజును మంచి గిఫ్ట్ తో గుర్తుండిపోయేలా చేసిన నితిన్ కు కృతజ్ఞతలు..' అని రాసుకున్నాడు. వెంకీ మొదటి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాగశౌర్య రష్మిక మందన జంటగా వచ్చిన 'ఛలో' సినిమా సూపర్ హిట్ అయింది. రష్మికకు తెలుగులో ఇదే తొలి సినిమా. తొలి సినిమా సెంటిమెంట్ తో రష్మికను భీష్మలో కూడా తీసుకుని ఛలో కంటే పెద్ద హిట్ కొట్టాడు. ఇక ఇక్కడ విశేషమేమంటే.. ఛలో హిట్ అయ్యాక నాగశౌర్య కూడా వెంకీకి కారు గిఫ్ట్ ఇచ్చాడు.



'భీష్మ'తో తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుములకు హీరో నితిన్ రేంజ్ రోవర్ లగ్జరీ కారును వెంకీ పుట్టిన రోజు సందర్భంగా.. స్వయంగా ఆయనింటికి వెళ్లి, కారును ఇచ్చిన నితిన్ దర్శకుడు వెంకీకి శుభాభినందనలు తెలిపాడు. ఇక ఈ రేంజ్ రోవర్ కారు ధర సుమారు రూ. 1 కోటికి పైగానే ఉంటుందని సమాచారం. భీష్మ తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే నటిస్తుండగా.. వెంకీ కుడుముల 'భీష్మ' తరువాత రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తయ్యాక రామ్ చరణ్‌తో వెంకీ తన చిత్రాన్ని పట్టాలెక్కించాలన్న ఆలోచనలో ఉన్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
Published by: Suresh Rachamalla
First published: September 9, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading