Nithiin Check: నితిన్, చంద్ర శేఖర్ యేలేటి ‘చెక్’ మూవీ విడుదల తేదీ ఖరారు..

నితిన్ ‘చెక్’ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

యువ హీరో నితిన్ వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. అందులో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేస్తోన్న ‘చెక్’ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ తాజాగా ఖరారు చేసింది.

  • Share this:
    యువ హీరో నితిన్ వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన  ‘భీష్మ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నితిన్. కరోనా లేకపోయి ఉంటే.. ఈ సినిమా వసూళ్లు బాగా పెరిగేవి.  ప్రస్తుతం  నితిన్..  వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చేస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నారు.

    ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా కంటే ముందు నితిన్  చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ‘చెక్’ సినిమా విడుదల కానుంది.  వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపిస్తాడట. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.


    ''చదరంగం నేపథ్యంలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథతో చిత్రం తెరకెక్కింది. నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. చంద్రశేఖర్‌ యేలేటి చాలా విభిన్నంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌, హర్షవర్థన్‌, సంపత్ రాజ్, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.మరోవైపు   నితిన్  హిందీలో సూపర్ హిటైనా ‘అంధధున్’ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: