నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన 'భీష్మ' మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో కామెడీతో పాటు కొంత సోషల్ మెసేజ్ కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్న నితిన్‌కు సరైన సమయంలో మంచి విజయం దక్కింది. ఈ సినిమాలో నితిన్ కామెడీ టైమింగ్, కథ కథనాలు అన్ని కుదరడంతో పాటు సినిమాలో సంగీతం కూడా ఈ చిత్రాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. అయితే సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్న సమయంలో ఈ చిత్రంపై కరోనా ఎఫెక్ట్ చూపడం మొదలైంది. ఈ కారణంగానే చాలామంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయారు. అలాంటివారిని నెట్ ఫ్లిక్స్ ద్వారా 'భీష్మ' పలకరించనుంది. ఈ సినిమా ఈ నెల 25న అనగా రేపు నెట్ ఫ్లిక్స్ తన వ్యువర్స్కు అందుబాటులో తీసుకురానుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై ఓ సంచనలం సృష్టించింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ అందర్నీ షాక్‌కు గురిచేసింది. కారణం ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మీద అదరగొట్టింది. మరి నితిన్ భీష్మ థియేటర్స్ అదరగొట్టింది.. ఓటీటీలో ఎలా ఫెర్ఫామ్ చేయనుందో చూడాలి. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ నితిన్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ హిందీ సూపర్ హిట్ సినిమా అంధాధున్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.