Home /News /movies /

NITHIN ANJALI MACHERLA NIYOJAKAVARGAM RA RA REDDY SONG CROSS 20 MILLION VIEWS IN YOUTUBE TA

Nithiin - Macherla Niyojakavargam : 20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' రారా రెడ్డి పాట..

సోషల్ మీడియాలో దూసుకుపోతు్న ‘రారా రెడ్డి’ సాంగ్ ( Photo Twitter)

సోషల్ మీడియాలో దూసుకుపోతు్న ‘రారా రెడ్డి’ సాంగ్ ( Photo Twitter)

Nithiin - Macherla Niyojakavargam : నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. తాజాగా ఈ సినిమాలోని ‘రారా రెడ్డి’ అనే సాంగ్ సూపర్ సెన్సేషన్‌గా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

    Nithiin - Macherla Niyojakavargam  | గతేడాది హీరో నితిన్ మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చేసిన   ‘మాస్ట్రో’ (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల చేస్తే  మంచి ఆదరణ పొందింది. అది అలా ఉంటే నితిన్‌ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తోంది. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.   ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేథరిన్ నటిస్తోంది.

    తాజాగా ఈ సినిమాలోని   'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్ వీర మాస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. 20+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట 300K + లైక్స్ ని సొంతం చేసుకొని గత 11 రోజులుగా యూట్యూబ్ మ్యూజిక్ నెంబర్ 1 గా ట్రెండింగ్‌లో ఉంది.  నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. నితిన్ తొలి చిత్రం 'జయం' లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ ని తెచ్చింది. 'రారా రెడ్డి' పాట ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ గా దూసుకుపోతుంది. ఈ పాటకు లక్షలాది సంఖ్యలో రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై సందడి చేస్తున్నాయి. ప్రతి మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్ పై 'రారా రెడ్డి' పాటే టాప్ ట్రెండ్ లో వుండటం విశేషం.



    ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అదిరిందే అనే మూడో పాటను ఈ నెల 23న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాటను నితిన్, కృతి శెట్టిలపై చిత్రీకరించారు.

    ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి అదిరిందే సాంగ్ విడుదల (Twitter/Photo)


    పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక నితిన్ ‘భీష్మ’ చిత్రానికి అతను అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఇపుడు మరోసారి నితిన్ సినిమాకు స్వరాలు సమకూర్చారు.  ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anjali, Catherine tresa, Krithi shetty, Macherla Niyojakavargam, Nithiin, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు