Andhadhun Telugu Remake : టబు పాత్రలో తమన్నా.. అధికారిక ప్రకటన..

Andhadhun Telugu Remake : ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 19, 2020, 1:16 PM IST
Andhadhun Telugu Remake : టబు పాత్రలో తమన్నా.. అధికారిక ప్రకటన..
నితిన్, తమన్నా,Photo : Twitter
  • Share this:
హిందీ వర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అంధాధున్. ఈ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం ఈ పాత్ర కోసం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్, కొంత బోల్డ్‌‌గా ఉండే ఈ పాత్రను తెలుగులో కూడా ఆమె చేయనుందని కొన్ని రోజులు టాక్ నడిచింది. ఆ తరువాత ఆ పాత్ర అనసూయకు దక్కిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు రమ్యకృష్ణ అంటూ టాక్ నడిచింది. అయితే ఈ పాత్ర చేయాలంటే రమ్య కృష్ణ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాని కూడా పరిశీలించిందట చిత్రబృందం. అయితే ఆ పాత్రకి ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. దీంతో ఏం చేయాలో తెలియని చిత్రయూనిట్ కొంతకాలం పాటు ఈ చిత్రాన్ని వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ నడిచింది.


అంతేకాదు ఈ సినిమాలో ఆ కీలకపాత్ర కోసం స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆమెను సంప్రదించారని.. అయితే ఆమె ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. దీంతో అందాల నటి శ్రియను సంప్రదిస్తే.. దాదాపు ఈమే ఈ సినిమాలో నటించడం ఖాయం అయ్యిందని ఆ ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చింది. టబు పాత్రలో తమన్నా.. హీరోయిన్ పాత్రలో నభా నటేష్ నటించనున్నారని అధికారికంగా ప్రకటించింది. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది.  అంధాధున్ తెలుగు రీమేక్‌ నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు.
ఇక నితిన్ ఇతర సినిమాల విషయానికి వస్తే ఆయన.. ప్రస్తుతం కీర్తి జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోన్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో నితిన్ పవర్ పేట అనే ఓ భారీ యాక్షన్ సినిమాలోను నటించనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 19, 2020, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading