news18-telugu
Updated: March 29, 2020, 2:23 PM IST
వెంకీ అట్లూరి: తొలిప్రేమ సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్టూరి.. మిస్టర్ మజ్నుతో ట్రాక్ తప్పాడు. దాంతో ఇప్పుడు నితిన్ రంగ్ దే సినిమాతో హిట్ కొట్టి ఫామ్లోకి వద్దాం అనుకుంటే కరోనాతో అంతా కల్లోలం అయిపోయింది.
నితిన్ తాజాగా భీష్మతో బంపర్ హిట్ అందుకున్నాడు. భీష్మ తర్వాత ఆయన నుండి వస్తోన్న మరో ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. కాగా ఈరోజు ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అందులో భాగంగా రంగ్ దేకు సంబందించి ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. నితిన్ భీష్మ చిత్రాన్ని నిర్మించిన సంస్థే ఈ రంగ్ దే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
Published by:
Suresh Rachamalla
First published:
March 29, 2020, 2:23 PM IST