Home /News /movies /

NITHIIN VAKKANTHAM VAMSI FILM TITLED AS JUNIOR HERE ARE THE DETAILS SR

Nithiin : వెరైటీ టైటిల్‌తో వస్తోన్న యువ హీరో నితిన్.. ఈసారి హిట్ కొట్టేనా..

Nithiin Photo : Twitter

Nithiin Photo : Twitter

Nithiin : యూత్ స్టార్ నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi)  దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    యూత్ స్టార్ నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి 'జూనియర్' (Junior )అనే టైటిల్‌ను ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఠాగూర్ మధు నిరిస్తున్నారు. ఈ సినిమాకు సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ జైరాజ్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. హరీష్ జైరాజ్ పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చివరగా తెలుగులో మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఆ తర్వాత ఇన్నాళ్లకు నితిన్ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని హరీష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే.. హరీష్ సమకూర్చిన ఏ తెలుగు సినిమా పెద్దగా అలరించలేదు. పాటలు మాత్రం ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. చూడాలి మరి నితిన్ (Junior ) సినిమా ఎలా ఉండనుందో..

    ఇక నితిన్ చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నారు. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాచర్ల నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29, 2022న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఎన్నికల ఆఫీసర్‌గా నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తున్నారు. ఇక తాజాగా వస్తోన్నసమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనుందని టాక్.

    Malavika Mohanan : పొట్టి నిక్కరులో పిచ్చెక్కించిన మలయాళీ అందం మాళవిక.. పిక్స్ వైరల్..

    ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నితిన్ హిందీ చిత్రం అంధాదున్ రీమేక్‌ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. ఈ తెలుగు సినిమాకు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించింది. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించారు. ఇక ఒరిజినల్‌ అంధధున్‌‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nithiin, Tollywood news

    తదుపరి వార్తలు