సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం అనేది వెరీ కామన్. టాకీ యుగం ప్రారంభ కాలం నుంచి రీమేక్ చేడడనేది ఉన్నది. తాజాగా నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ రేటుకే దక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ రణ్‌బీర్ కపూర్ ఒప్పుకోకపోతే.. వరుణ్ ధావన్ లేదా టైగర్ ష్రాఫ్ హీరోగా రీమేక్ చేయాలనే ఆలోచనలో కరణ్ జోహార్ ఉన్నాడట. ఇప్పటికే కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ హక్కులను చేజిక్కించుకున్నాడు. హిందీలో ఈ సినిమాను పూర్తిగా మార్చి తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట.
మరోవైపు నితిన్.. హిందీలో హిట్టైన ‘అంధాదున్’ సినిమాను తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రకంగా నితిన్.. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంటే..తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ బాలీవుడ్‌లో రీమేక్ కానుండటం విశేషం. .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Bollywood, Karan Johar, Nithiin, Ranbir Kapoor, Telugu Cinema, Tiger shroff, Tollywood, Varun Dhawan, Venky Kudumula