నితిన్ కొత్త చిత్రం ప్రారంభం.. ముఖ్యపాత్రలో అనసూయ..

నితిన్ తాజాగా హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ రోజు ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

news18-telugu
Updated: February 24, 2020, 2:19 PM IST
నితిన్ కొత్త చిత్రం ప్రారంభం.. ముఖ్యపాత్రలో అనసూయ..
నితిన్, అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)
  • Share this:
దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేసాడు. ఈ చిత్రం మంచి టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రం సాధించిన సక్సెస్‌తో ఆనందంలో ఉన్ననితిన్ తాజాగా హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ రోజు ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. .ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి, సూర్యదేవర రాధాకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ పూజా కార్యక్రమంలో మెరిసారు.

after bheeshma success nithiin started andhadhun remake under merlapaka gandhi director,nithin,nithiin merlapaka gandhi,merlapaka gandhi direction andhadhun remke,nithiin twitter,nithiin instagram,nithiin facebook,bheeshma,bheshma collections,nithiin bollywood super hit remakes,naga chaitanya ayushma khurana nithiin ayushma khurana,ayushman khurana,nithiin remake Andhadhun,bollywood,tollywood,నితిన్,ఆయుష్మాన్ ఖురానా,నితిన్ అంధాధున్ తెలుగు రీమేక్,అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్,బాలీవుడ్,టాలీవుడ్,నితిన్, మేర్లపాక గాంధీ,మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా అంధాధున్ రీమేక్ స్టార్ట్
‘అంధాధున్’ రీమేక్‌‌కు కొబ్బరికాయ కొట్టిన నితిన్ (Twitter/Photo)


దేవుని పటాలపై ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా.. నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేస్తే.. సురేందర్  రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. మరో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ.. సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడు మేర్లపాక గాంధీకి అందచేసారు. ఈ చిత్రంలో యాక్ట్ చేసే మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేయనున్నారు. హిందీలో కథలో కీలకంగా ఉన్న టబు పాత్రను తెలుగులో అనసూయను అనుకుంటున్నారు.

nithiin started andhadhun remake under merlapaka gandhi direction anasuya bharadwaj will play importent role,nithin,nithin,anasuya bharadwaj,nithiin anasuya bharadwaj play importent role,nithiin merlapaka gandhi,merlapaka gandhi direction andhadhun remke,nithiin twitter,nithiin instagram,nithiin facebook,bheeshma,bheshma collections,nithiin bollywood super hit remakes,naga chaitanya ayushma khurana nithiin ayushma khurana,ayushman khurana,nithiin remake Andhadhun,bollywood,tollywood,నితిన్,ఆయుష్మాన్ ఖురానా,నితిన్ అంధాధున్ తెలుగు రీమేక్,అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్,బాలీవుడ్,టాలీవుడ్,నితిన్, మేర్లపాక గాంధీ,మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా అంధాధున్ రీమేక్ స్టార్ట్,నితిన్ అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్
అంధాదున్ తెలుగు రీమేక్‌లో నితిన్ (Facebook/Photo)


త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ‘అంధాధున్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో  నటనకు గాను ఆయుష్మాన్ ఖురానా జాతీయ స్థాయిలో ఉత్తమనటుడు అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 24, 2020, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading