శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నితిన్ హీరోగా నటించిన సినిమా ‘భీష్మ’. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అందాల రష్మిక మందన నితిన్‌కు జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ నెల 21న శివరాత్రి రోజున రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ‘భీష్మ’ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్‌లో దుర్యోదనుడు..దుశ్శాసన.. ధర్మరాజు..యమధర్మరాజు..శని..శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా.. పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. పేరు మహత్యం ఏమో కానీ.. ఒక్కరు పడటం లేదని నితిన్ చెప్పే డైలాగ్ ఆద్యంతం ఆకట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రసాయన ఎరువులతో పండిన పంటలతో పంటతో పాటు వ్యవసాయ భూములు నాశనం అవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. ఈ ఆర్గానిక్ కల్టివేషన్ నేపథ్యంలో ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రంతో నితిన్ మరో హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Nithiin, Rashmika mandanna, Telugu Cinema, Tollywood