Bheeshma : నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే రొమాంటిక్ కామెడీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. దీంతో ప్రఛార కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా ఇటివలే ఈ సినిమా నుండి మాస్ సాంగ్ ‘వాట్ యే బ్యూటీ’ వీడియో ప్రోమో రిలీజ్ అయ్యి అదిరిపోయే స్పందన దక్కించుకుంది. తాజాగా సింగిల్ అంతెమ్ అంటూ మరో సాంగ్‌ను విడుదల చేసింది. ప్రేమికుల రోజు సందర్బంగా విడుదలైన ఆ సాంగ్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పాటల్నీ, విడుదలై టీజర్‌ను చూస్తుంటే ఈ సినిమాలో నితిన్ రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. అది అలా ఉంటే నితిన్ గత సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. దీంతో భీష్మపై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. వెంకి కుడుముల భీష్మ సినిమా పూర్తిగా కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనర్‌గా మలుస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుంది.
‘భీష్మ’ రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న ఘనంగా జరగనుంది. అయితే తాజా విశేషమేమిటంటే అల వైకుంఠపురములోతో సూపర్ హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రానున్నాడు. త్రివిక్రమ్ రాకతో సినిమాకు మరింత బజ్ రానుంది. దీనికి తోడు రష్మిక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవ్వడం కూడా సినిమాకు ఉపయోగపడునుంది. తాజాగా మహేష్ సరిలేరు నీకెవ్వరుతో మంచి హిట్ అందుకుంది రష్మిక. దీంతో ఈ అమ్మడు క్రేజ్ కూడా సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్‌కు ఉపయోగపడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Nithiin, Rashmika mandanna