Nithiin: నితిన్ పెళ్లికి వెంకీ గిఫ్ట్.. ‘రంగ్ దే’ స్పెషల్ టీజర్..

Nithiin Rang De teaser: నితిన్ ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉన్నాడు. జులై 26 రాత్రి ఈయన షాలిని మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 26, 2020, 4:33 PM IST
Nithiin: నితిన్ పెళ్లికి వెంకీ గిఫ్ట్.. ‘రంగ్ దే’ స్పెషల్ టీజర్..
రంగ్ దే పోస్టర్ (nithiin rang de/Twitter)
  • Share this:
నితిన్ ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉన్నాడు. జులై 26 రాత్రి ఈయన షాలిని మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరు కానున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా ఎవర్నీ పెద్దగా ఆహ్వానించలేదు నితిన్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు మాత్రం ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే పెళ్లితో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు నితిన్. ఇప్పటికే ఈ ఏడాది భీష్మతో హిట్ అందుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఈయన వెంకీ అట్లూరీతో రంగ్ దే.. చంద్రశేఖర్ యేలేటితో చెక్.. కృష్ణ చైతన్యతో పవర్ పేట సినిమాలు చేస్తున్నాడు.
రంగ్ దే పోస్టర్ (nithiin rang de/Twitter)
రంగ్ దే పోస్టర్ (nithiin rang de/Twitter)


ఈ మూడు సినిమాలతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా లైన్‌లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నితిన్‌కు అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు వెంకీ అట్లూరీ. ఈయనతోనే ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఒకటి విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కూడా పూర్తిగా పెళ్లిపైనే కామెడీ వర్కవుట్ చేసాడు దర్శకుడు. చిన్న సైజ్ ఎఫ్2 మాదిరి ఈ టీజర్ కట్ చేసాడు.

అందులో పెళ్లి అంటే వద్దనే నితిన్.. ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపించారు. ఈ టీజర్ అదిరిపోయింది.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ టీజర్ చివర్లో నితిన్ అంట్లు తోముతూ.. ఇల్లు ఊడుస్తున్న విజవల్స్ అదిరిపోయాయి. చివర్లో నితిన్ రియల్ లైఫ్ పార్ట్‌నర్ ఫోటో కూడా చూపించారు దర్శక నిర్మాతలు. 2021 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అది కూడా పక్కా కాదు.. అప్పటి వరకు పరిస్థితులు అనుకూలిస్తే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు.
Published by: Praveen Kumar Vadla
First published: July 26, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading