Nithin Check Trailer Talk: ఎత్తుకు పై ఎత్తులేస్తోన్న నితిన్.. మరో హిట్ గ్యారెంటీ..

Nithin Check Trailer Photo : Twitter

Nithiin | Rakul Preet | Priya Varrier : యువ హీరో నితిన్‌, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

  • Share this:
    యువ హీరో నితిన్‌, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ ఈ సినిమాలో ఖైదీగా నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఇక ట్రైలర్‌ను పరిశీలిస్తే.. జైల్లో ఓ పెద్దాయన (సాయి చంద్‌) ఒంటరిగా చెస్‌ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్)‌ చెస్ ఆడేటప్పుడు ఆపోనెంట్ ఉంటేనే కిక్కు.. అతనితో చెస్ మొదలుపెడుతాడు. ఇక ఆ తర్వాత నితిన్ వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతు అవుతుంది. ఇక మరోవైపు నితిన్‌కు రకుల్ సాయం చేస్తూ ఉంటుంది. దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్‌ రకుల్‌. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. మరి అసలు నితిన్ ఖైదీ ఎందుకు మారాడు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. ఆకట్టుకునే మాటలతో, సన్నివేశాలతో నితిన్ చెక్ అదరగొడుతోంది.

    ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌, హర్షవర్థన్‌, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    ఇక నితిన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్న నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది.


    ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

    ఇక సినిమాతో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published: