• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NITHIIN NEW MOVIE TITLED AS MASTRO AND FIRST TITLE RELEASED MHN

Nithiin Mastro: 'మాస్ట్రో'గా మారిన నితిన్‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాడు

Nithiin new movie titled as Mastro and first title released mhn)

Nithiin Mastro: బాలీవుడ్‌ చిత్రం 'అందాధున్‌' తెలుగు రీమేక్‌లో నితిన్‌ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో మాస్ట్రో అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

  • Share this:
    వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి హీరో నితిన్ బ‌లంగానే నిశ్చ‌యించుకున్న‌ట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, గ‌త ఏడాది భీష్మ సినిమాకు ముందు ఏడాదిన్న‌ర పాటు సినిమాలేమీ చేయ‌ని నితిన్.. త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాల‌ను లైన్‌లో పెట్టుకున్నాడు. అంతలోనే కోవిడ్ ప్ర‌భావంతో సినీ ఇండ‌స్ట్రీ ఆగింది. కోవిడ్ ప్ర‌భావం త‌ర్వాత నితిన్ మ‌ళ్లీ స్పీడు పెంచాడు. అందులో భాగంగా ఈ ఏడాది థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత చెక్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఆశించినంత మేర‌కు విజ‌యాన్ని సాధించ‌లేదు.

    చెక్ త‌ర్వాత నితిన్ చేసిన మ‌రో సినిమా రంగ్ దే రీసెంట్‌గానే విడుద‌లైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వసూళ్ల‌నే సాధిస్తోంది. రొటీన్ క‌థే.. అయితే ఈ సినిమాకు బ‌ల‌మైన పోటీ ఏదీ లేక‌పోవ‌డంతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ సినిమా కావ‌డంతో, మంచి క‌లెక్ష‌న్స్‌ను సాదిస్తోంది రంగ్ దే. ఇప్పుడు నితిన్ త‌న కిట్టీలోని మ‌రో సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఆ సినిమాయే బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్‌. ఈ రీమేక్‌ను నితిన్ త‌న సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మాస్ట్రో అనే టైటిల్‌ను ఖ‌రారు చేసింది యూనిట్‌. మార్చి 30 నితిన్ పుట్టిన‌రోజు కావ‌డంతో ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.



    బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్ర‌ను తెలుగులో నితిన్ చేస్తుండ‌గా.. రాధికా ఆప్టే చేసిన హీరోయిన్ పాత్ర‌లో న‌భా న‌టేశ్ న‌టిస్తోంది. ఇక సినిమాలో మెయిన్ రోల్ ట‌బు. ఈ పాత్ర‌ను తెలుగులో త‌మ‌న్నా భాటియా చేస్తుండ‌టం విశేషం. ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తుండ‌టం కూడా ఇదే ఫ‌స్ట్ టైమ్‌. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు.
    Published by:Anil
    First published: