• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NITHIIN NABHA NATESH MAESTRO TO STREAM ON HOTSTAR FROM THIS DATE HERE ARE THE DETAILS SR

Nithiin Maestro : హాట్ స్టార్‌‌లో నితిన్ మాస్ట్రో.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

Nithiin Maestro on hotstar Photo : Twitter

Nithiin Maestro : యువ నటుడు నితిన్.. ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది.

  • Share this:
    యువ నటుడు నితిన్.. ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 15న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.32 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు. నితిన్ సరసన నభా నటేష్ నటించింది. ఇక ఒరిజినల్‌లో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్లో రిలీజై అక్కడ అదరగొడుతోంది.

    ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక నితిన్ ఇటీవల నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు.


    మాస్ట్రో తర్వాత వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలిసింది. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. చూడాలి మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో. దీంతో పాటు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: