Nithiin Maestro : షూటింగ్ పూర్తి చేసుకున్న నితిన్ నభా నటేష్ మాస్ట్రో...

Nithiin and Nabha natesh in maestro Photo : Twitter

Nithiin Maestro : నితిన్.. ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది’.

  • Share this:
    నితిన్.. ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా ఈరోజుతో షూటింగ్ పార్ట్‌ను ముగించుకుందని చిత్రదర్శక నిర్మాతలు తెలియజేశారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తోంది. మరోకీలక పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. త్వరలో విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించనుంది. ఇక నితిన్ ఇటీవల నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోయింది.


    ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు. మాస్ట్రో తర్వాత వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలిసింది. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. చూడాలి మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో. దీంతో పాటు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: