Home /News /movies /

NITHIIN NABHA NATESH MAESTRO GETS GOOD OFFER FROM HOTSTAR TO STREAM DIRECTLY HERE ARE THE DETAILS SR

Nithiin Maestro : ఓటీటీలో నితిన్ మాస్ట్రో.. హాట్ స్టార్‌తో డీల్ ఫైనల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Nithiin in Maestro Photo : Twitter

Nithiin in Maestro Photo : Twitter

Nithiin Maestro : యువ నటుడు నితిన్.. ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

    యువ నటుడు నితిన్.. ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను ముగించుకుంది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను హాట్ స్టార్ సంస్థ రూ.32 కోట్లుకు కొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మేకింగ్ కి రూ.29 కోట్ల వరకు ఖర్చయిందట. ఈ సినిమా ఆగస్టులో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక  ప్రకటన వెలువడాల్సిఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు.

    ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నితిన్‌కు జోడిగా నటిస్తోంది. మరోకీలక పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఇక నితిన్ ఇటీవల నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోయింది.

    ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు. మాస్ట్రో తర్వాత వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలిసింది. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. చూడాలి మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో. దీంతో పాటు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nabha Natesh, Nithiin, Tamanna, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు