NITHIIN MOVIES HINDI VERSION CREATING HISTORY IN YOU TUBE AND RELEASED BY ADITYA MOVIES PK
నితిన్ సంచలన రికార్డ్.. 3 సినిమాలు 400 మిలియన్లు..
ఛల్ మోహన్ రంగాతో డిజాస్టర్ ఇచ్చిన కృష్ణచైతన్యతో నితిన్ పవర్ పేట అనే సినిమా చేయబోతున్నాడు.
Nithiin: హీరో నితిన్ సంచలన రికార్డులకు తెర తీస్తున్నాడు. ఈయన సినిమాలు హిందీలో దుమ్ము దులిపేస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ సినిమాలన్నీ అక్కడ రప్ఫాడిస్తున్నాయి.
హీరో నితిన్ సంచలన రికార్డులకు తెర తీస్తున్నాడు. ఈయన సినిమాలు హిందీలో దుమ్ము దులిపేస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ సినిమాలన్నీ అక్కడ రప్ఫాడిస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్ నిర్వహిస్తున్న ఆదిత్య మూవీస్ విభాగానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో అప్ లోడ్ చేసిన వివిధ తెలుగు హీరోల, హిందీ డబ్బింగ్ సినిమాలకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ హీరో నటించిన అ ఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఓవరాల్‌గా 400 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
నితిన్ (Nithiin)
ఇందులో దాదాపు అ..ఆ సినిమాకు 182 మిలియన్ల వ్యూస్.. అ..ఆ 2 (ఛల్ మోహన్ రంగ హిందీ వెర్షన్)కు 112 మిలియన్ల వ్యూస్.. శ్రీనివాస కళ్యాణం కు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నితిన్ నటించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్ ఆదిత్య మూవీస్‌తోనే ఉన్నాయి. అలానే ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్లో వరుసగా రిలీజ్ అవ్వడం.. అవి హిందీలో ఇలా రికార్డ్ వ్యూస్ అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా సంస్ధ మేనెజింగ్ డైరెక్టర్ ఉమేశ్ గుప్త మాట్లాడుతూ.. మా ఆదిత్య మూవీస్ ఛానల్‌ని విశేషంగా ఆదరిస్తున్న వ్యూయర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన అ..ఆ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేయడంతోనే మా ఆదిత్య మూవీస్ మొదలైంది.
నితిన్ (Nithiin)
సాధారణంగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే నార్త్ ఆడియన్స్, అ.. ఆ లాంటి ఫ్యామిలీ సినిమాను విశేషంగా ఆదరించారు.. అనూహ్యంగా అ..ఆ తరువాత కూడా నితిన్ నుంచి వచ్చిన చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలకి భారీగా స్పందన లభించడం విశేషం అని తెలిపారు. నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి ఆయన నటించిన సినిమాల్లో దాదాపు 19 సినిమాలు ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ నుంచే విడుదల చేయడం జరిగిందని.. అందులో జయం, దిల్, సై, ఇష్క్, అ ఆ, భీష్మ లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయని చెప్పాడు ఈయన. ఇన్నేళ్లుగా తమ సంస్థపై నమ్మకం ఉంచుతూ వస్తున్న నితిన్‌కు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు ఆదిత్య గుప్తా.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.