నితిన్ కాబోయే అత్తగారికి మెగా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ తెలుసా..

నితిన్ త్వరలోనే ఒకింటివాడు కాబోతున్నాడు. ఉన్నట్లుండి సడన్‌గా షాలిని అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఐతే.. నితిన్ అత్తగారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి రిలేషన్ ఉంది.

news18-telugu
Updated: February 17, 2020, 5:26 PM IST
నితిన్ కాబోయే అత్తగారికి మెగా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి,నితిన్ దంపతులు (Twitter/Photo)
  • Share this:
నితిన్ త్వరలోనే ఒకింటివాడు కాబోతున్నాడు. ఉన్నట్లుండి సడన్‌గా షాలిని అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేమో.. నిన్నమొన్నటి పరిచయమేమో అనుకున్నారంతా. కానీ ఈయన మాత్రం తన లవ్ స్టోరీని 8 ఏళ్లుగా నడిపిస్తున్నాడు. చాలా సైలెంట్‌గా ఈ హీరో ప్రేమలో ఉన్నాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి తన ఎనిమిదేళ్ల పరిచయం.. ఐదేళ్ల ప్రేమను పెళ్లితో శుభం కార్డ్ వేయబోతున్నాడు నితిన్. ఈయనకు కాబోయే మామగారు సంపత్, అత్త గారు నూర్జహాన్.. వీళ్లిద్దరు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఐతే.. నితిన్ అత్తగారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి రిలేషన్ ఉంది. అదేమిటంటే.. నితిన్ కాబోయే అత్తగారు.. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వతా నితిన్ అత్తగారైన నూర్జహాన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఐనా.. వీల్లకు మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్ ఉంది. అంతేకాదు నితిన్ కాబోయే మామగారికి పూర్వ మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రగతి హాస్పిటిల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ నితిన్‌కు కాబోయే అత్త డాక్టర్ నూర్జహాన్ అక్కడి ప్రజలకు సుపరిచితమే.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు