Home /News /movies /

NITHIIN MAESTRO ON HOTSTAR HERE IS THE TWITTER REVIEW SR

Nithiin Maestro Twitter Review : నితిన్ మాస్ట్రో ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

Maestro Photo : Twitter

Maestro Photo : Twitter

Nithiin Maestro on Hotstar : యువ హీరో నితిన్ మాస్ట్రో అనే థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్ రిలీజ్‌ను స్కిప్ చేసి డైరెక్ట్‌గా హాట్ స్టార్‌లో ఈరోజు ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథేంటీ.. కథనం ఎలా సాగింది.. ప్రధాన పాత్రల నటన ఎలా ఉంది మొదలగు విషయాలను ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
    యువ హీరో నితిన్ మాస్ట్రో (Nithiin Maestro)అనే థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రస్తుత పరిస్థుతుల మధ్య ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమా ఈరోజు నుంచి అంటే ఉదయం 12 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది (Nithiin Maestro on Hotstar ). దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మాస్ట్రో పట్ల తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మాస్ట్రో ఎలా ఉంది.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఈ సినిమా తెలుగు వారిని ఎలా ఆకట్టుకుంటోంది.. నితిన్ నటన ఎలా ఉంది మొదలగు విషయాల గూర్చి ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.. అవేంటో చూద్దాం..

    ఇక ఈ సినిమా హిందీ అంధధున్ చిత్రానికి ఇది రీమేక్ కావడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు ఇప్పటికే తెలిపారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
















    ఇక 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ (Hotstar )  సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.35 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది.

    ఇక ఒరిజినల్‌ అంధధున్‌‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు.

    ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక నితిన్ ఇటీవల నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చారు.

    ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోయింది. నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు.

    మాస్ట్రో తర్వాత నితిన్ మరో సినిమాను మొదలు పెట్టారు. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి (Krithi Shetty )నటించనుంది. ఈ సినిమాను నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Maestro Movie, Nabha Natesh, Nithiin, Tamannaah, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు