NITHIIN MAESTRO MOVIE VENNELLO AADAPILLA FULL VIDEO SONG RELEASED NABHA NATESH RAVISHING IN SONG TA
Nithiin - Maestro : నితిన్ ‘మాస్ట్రో’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ గా నభా నటేష్ అదుర్స్..
నితిన్ ‘మ్యాస్ట్రో’ నుంచి వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ విడుదల (Twitter/Photo)
Nithiin - Maestro : యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం ‘మాస్ట్రో’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా నుంచి వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్‌ను విడుదల చేసారు.
Nithiin - Maestro : యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం ‘మాస్ట్రో’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్. హిందీలో ఈ సినిమాలోని నటనకు ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తెలుగు నేటీవిటీకి తగ్గట్టు మేర్లపాక గాంధీ కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 15న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.32 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు. నితిన్ సరసన నభా నటేష్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘వెన్నెల్లో ఆడపిల్ల’ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ సాంగ్‌లో నభా నటేష్ తన గ్లామర్‌తో మరోసారి కట్టిపడేసింది.
‘మ్యాస్ట్రో’ ఒరిజినల్ ‘అంధాదున్’లో టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా చేసింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్లో రిలీజై అక్కడ అదరగొడుతోంది.
ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక నితిన్ ఇటీవల నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు.
’మ్యాస్ట్రో’లో నితిన్, నభా నటేష్,తమన్నా (Nithiin and Nabha natesh in maestro Photo : Twitter)
మాస్ట్రో తర్వాత వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలిసింది. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. చూడాలి మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో. దీంతో పాటు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.