Home /News /movies /

NITHIIN MACHERLA NIYOJAKAVARGAM TRAILER RELEASED SLB

Macherla Niyojakavargam Trailer: కలెక్టర్‌ మీద చెయ్యేస్తే! నితిన్ స్ట్రాంగ్ వార్నింగ్

Macherla Niyojakavargam Trailer (Twitter/Photo)

Macherla Niyojakavargam Trailer (Twitter/Photo)

నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' (Macharla Niyojakavargam) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

హీరో నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' (Macharla Niyojakavargam) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గుంటూరులోని బ్రోడీపేటలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో 'కలెక్టర్‌ మీద చెయ్యేస్తే గవర్నమెంట్‌ మీద చెయ్యి వేసినట్టే' అనే డైలాగ్‌ వపర్‌ఫుల్‌గా ఉంది. కలెక్టర్‌గా నా బాధ్యత.. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిపించడమే అంటూ నితిన్ చెప్పిన డైలాగ్‌ సినిమా నేపధ్యాన్ని తెలుపుతోంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఎంతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ కట్ చేశారు. దాదాపు 3 నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ ట్రైలర్ మాచర్ల నియోజకవర్గం సినిమాపై హైప్ పెంచేసింది.

ఇకపోతే ఈ మూవీలో మరో హీరోయిన్ అంజలి స్పెషల్ నంబర్ 'రారా రెడ్డి'తో సందడి చేయబోతోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తూ వచ్చింది. తాజాగా ట్రైలర్ కూడా అంతకుమించి అన్నట్లుగా ఉండటంతో జనం కన్ను ఈ సినిమాపై పడింది. సో.. చూడాలి మరి ఆగస్టు 12 అంటే ఈ సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది.
Published by:Sunil Boddula
First published:

Tags: Krithi shetty, Nithiin, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు