నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల తేది ఖరారు.. (Twitter/Photo)
Nithiin - Macherla Niyojakavargam : నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ విడుదల తేదిని నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల తేదిని అఫీషియల్‌గా ప్రకటించారు.
Nithiin - Macherla Niyojakavargam | గతేడాది హీరో నితిన్ మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చేసిన ‘మాస్ట్రో’ (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల చేస్తే మంచి ఆదరణ పొందింది. అది అలా ఉంటే నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తోంది. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా కేథరిన్ నటిస్తోంది.
ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాను జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నితిన్ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు.
నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్ ప్రకటన (Twitter/Photo)
హిందీలో నితిన్ డబ్బింగ్ సినిమాలను 2.3 బిలియన్ రెండు వందల ముప్పె కోట్ల మంది యూట్యూబ్ వేదికగా చూసారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ రికార్డు అందకున్న ఏకైక హీరోగా నితిన్ రికార్డులకు ఎక్కారు. నితిన్ దరిదాపుల్లో కేవలం రామ్ పోతినేని మాత్రమే హిందీ డబ్బింగ్ వెర్షన్లో 2 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన హీరోగా నిలిచారు. మొత్తంగా నితిన్.. ఇంట గెలిచి.. ఇపుడు యూట్యూబ్ వేదికగా బీటౌన్‌లో రచ్చ చేయడం మాములు విషయం కాదు.
ఇక నితిన్ మాస్ట్రో విషయానికి వస్తే.. హీరో నితిన్ మాస్ట్రో (Nithiin Maestro)అనే థ్రిల్లర్ హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో తమన్నా విలన్ పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్, లవ్ ట్రాక్ మరియు నితిన్ (Nithiin) పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది.
ఇక ఒరిజినల్ అంధాధున్‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.