Home /News /movies /

NITHIIN MACHERLA NIYOJAKAVARGAM MOVIE REVIEW AND RATING ROUTINE POLITICAL ACTION DRAMA TA

మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)
మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)
2/5
రిలీజ్ తేదీ:12/08/2022
దర్శకుడు : ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి (M.S.RajaShekhar Reddy)
సంగీతం : మహతి స్వర సాగర్ (Mahathi Swara Sagar)
నటీనటులు : నితిన్, కేథరిన్, కృతి శెట్టి, రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, ఇంద్రజ తదితరులు..
సినిమా శైలి : పొలిటికల్ యాక్షన్ డ్రామా (Political Action Drama)
సినిమా నిడివి : 2 Hr 30 Minits

Macherla Niyojakavargam Movie Review: ’మాచర్ల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. డిపాజిట్ గల్లంతు..

’మాచర్ల నియోజకవర్గం’ మూవీ రివ్యూ (Twitter/Photo)

’మాచర్ల నియోజకవర్గం’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Macherla Niyojakavargam Movie Review | నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికగా నటించారు. నితిన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమాతో నితిన్ ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    రివ్యూ : మాచర్ల నియోజకవర్గం  (Macherla Niyojakavargam)
    నటీనటులు : నితిన్, కేథరిన్, కృతి శెట్టి, రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, ఇంద్రజ తదితరులు..
    ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
    సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
    సంగీతం: మహతి స్వర సాగర్
    నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
    దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి
    విడుదల తేది : 12/8/2022

    నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికగా నటించారు. నితిన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమాతో నితిన్ ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

    కథ విషయానికొస్తే.. 

    మాచర్ల నియోజకవర్గం సినిమా కథ విషయానికొస్తే.. గుంటూరు జిల్లా ‘మాచర్ల నియోజకవర్గం’ కథ విషయినికొస్తే.. ఈ నియోజకవర్గంలో రాజప్ప (సముద్ర ఖని) గత ముప్పై ఏళ్లుగా ఏక గ్రీవంగా ఎన్నికవుతూ వస్తుంటాడు. తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసినవాళ్లను చట్టానికి దొరకకండా చంపేస్తుంటాడు. అతని భయానికి అధికార పార్టీ కూడా అక్కడ క్యాండిడేట్‌ను నిలబెట్టాలంటే భయపడే పరిస్థితి . ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు కలెక్టర్‌కు వచ్చిన సిద్ధార్ధ్ రెడ్డి (నితిన్) మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.

    కథ, కథనం..

    దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖర్ మాచర్ల నియోజవర్గం అంటూ రొటిన్ కథను వండి వార్చాడు. ఈ సినిమా మొత్తం క్లారిటీ లేకుండా తనకు ఎలా తోస్తే అలా తెరకెక్కించాడు. ఈ సినిమాను 2022 నేపథ్యంలో తెరకెక్కించినట్టు చూపించాడు. కథలోకి వెళితే..  స్వాతి (కృతి శెట్టి) కలెక్టర్ అయిన తన అన్నను రాజప్ప (సముద్రఖని మనుషులు చంపుతారు. గుంటూరు జ్యురిడిక్షన్‌లోని ఈ కేసును వైజాగ్‌ పోలీస్ కమీషనర్‌కు హీరోయిన్ కంప్లైంట్ చేసినట్టు చూపిస్తారు. మరోవైపు అక్కడ న్యాయమూర్తులను ఈ కేసు విషయమై కలుస్తుంది. అంటే దర్శకుడు విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానికిగా చూపించాడు. గుంటూరు జిల్లాకు సంబంధించిన కేసు ఏదైనా ఉందంటే.. రాష్ట్ర డీజీపీకో లేదా హోం మినిష్టర్‌కో కంప్లైంల్ చేయాల్సిన హీరోయిన్‌.. విశాఖకు రావడమంలో మతలబు ఏమిటో దర్శకుడికే తెలియాలి. ఇక హీరో సిద్ధార్ధ్ రెడ్డి (నితిన్) మొత్తం గుంటూరు జిల్లాకు కలెక్టరా.. లేకుంటే కేవలం మాచర్ల నియోజకవర్గానికా అనేది దర్శకుడికే తెలియాలి.. ?

    జిల్లా కలెక్టర్ పోస్ట్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌ కోసం తగ్గించి చూపించడం దర్శకుడికే తెలియాలి. ఇక క్రియేటివ్ ఫ్రీడమ్ అన్నట్లు 2022లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగినట్టు చూపించాడు.అక్కడ ప్రస్తుతం ఏపీలో ఉన్న నియోజకవర్గాలు 175.. కానీ ఇందులో ఉమ్మడి ఏపీలో ఉన్న 294 అన్నట్లు చూపించారు. అది కూడా బ్లండర్ మిస్టేక్.  మొత్తంగా రాజశేఖర్ రెడ్డికి డైరెక్షన్ కొత్త కానీ.. ఎడిటర్‌గా సినీ రంగంలో 10 యేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా తెరకెక్కించాడనేది అతనికే తెలియాలి. ఎడిటర్ విషయానికొస్తే.. సినిమా ఫస్టాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ ఈగో కామెడీ మీదనే రన్ అవుతోంది. మధ్యలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్. ఇంటర్వెల్ వరకు స్టోరీ మెయిన్ స్ట్రీమింగ్‌లోకి వెళ్లదు. మొత్తంగా తన కత్తెరకు బాగా పదును పెట్టాల్సిన అతను ఆ విషయాన్ని మరిచిపోయి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఈ సినిమాకు ఉన్నంతో మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రాండ్ స్కోర్ మాత్రమే బాగుంది.

    నటీనటుల విషయానికొస్తే.. 

    హీరో ఎలివేట్ కావాలంటే ఎదురుగా పవర్‌ఫుల్ విలన్ ఉండాలి. కానీ హీరో నితిన్.. పవర్‌ఫుల్ ప్రతినాయకుడు ముందు అతని హీరోయిజం తేలిపోయినట్టు కనిపిస్తోంది. నితిన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఏమంత ఇంపాక్ట్‌గా లేవు. మాస్ హీరోగా నితిన్ అంతగా సూట్ కాడనే విషయం మరోసారి ఈ సినిమాతో స్పష్టమైంది. డాన్సుల్లో, కామెడీలో నితిన్ ఓకే అనిపించాడు.  ఇక హీరోయిన్‌గా నటించిన కృతి శెట్టి బాగుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. కేథరిన్ తన పరిధి మేరకు నటించింది. ఈ సినిమాలో రాజప్పగా.. అతని కుమారుడుగా రెండు పాత్రలో పవర్‌ఫుల్ విలనిజం చూపించాడు సముద్రఖని. సినిమా మొత్తంలో అతని యాక్టింగ్ హైలెట్ అని చెప్పాలి. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఈ సారి అంతగా వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. కానీ ఉన్నంతలో పర్వాలేదు. మిగతా పాత్రల్లో నటించిన శుభలేఖ సుధాకర్, రాజేంద్ర ప్రసాద్,మురళీ శర్మ పర్వాలేదనిపించారు.

    ప్లస్ పాయింట్స్ 

    మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్..

    సముద్రఖని నటన

    మైనస్ పాయింట్స్ 

    రొటీన్ కథ

    దర్శకత్వం

    ఫస్టాఫ్

    రేటింగ్ : 2.25 / 5
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    రేటింగ్

    కథ:
    2/5
    స్క్రీన్ ప్లే:
    2/5
    దర్శకత్వం:
    1.5/5
    సంగీతం:
    3/5

    Tags: Catherine tresa, Krithi shetty, Macherla Niyojakavargam, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు