Home /News /movies /

NITHIIN MACHERLA NIYOJAKAVARGAM MACHERLA DHAMKI RELEASE SB

Nithiin: నా సమాధి పునాదిగా వేసేందుకు నేను సిద్ధం.. అదిరిన మాచర్ల యాక్షన్ ధమ్కీ..!

 మాచర్ల ధమ్కీ రిలీజ్

మాచర్ల ధమ్కీ రిలీజ్

మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వచ్చేనెల 12వ తేదిన విడుదల కానుంది.

    నితిన్  హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్రం విడుదల ఎప్పుడు కానుందో టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం ఆగష్టు 12, 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది.  కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ మంచి ప్రమోషన్స్ చేస్తుండగా ఈ సినిమా ట్రైలర్ కన్నా ముందే ఒక చిన్న సర్ప్రైజ్ ట్రీట్ ని ఇస్తున్నట్టు తెలిపారు.

    కాసేపటి క్రితమే మాచర్ల యాక్షన్ ధమ్కీ రిలీజ్ చేశారు. ఈ సాలిడ్ వీడియో నెక్స్ట్ లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. నితిన్ డైలాగ్ తో మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇందులో కనిపిస్తుంది.  ‘ మహాభారతంలో ధర్మాన్ని కాపాడేందుకు లక్షలాది మంది తమ సమాధుల్ని పునాదులుగ వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం.. నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం’ అంటూ సాగే నితిన్ డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి.  అలాగే మహతి సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్లో అనిపిస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ మాచర్ల మాస్ ధమ్కీ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ఈ నెల 30న విడుదల కానున్న విషయం తెలిసిందే.


    ఈ సినిమాను మొదట జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాచర్ల నియోజకవర్గం సినిమాలో కేథరిన్ ట్రెస్సా, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Krithi Shetty) నితిన్ (Nithiin) సరసన హీరోయిన్‌లు చేస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్‌.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Nithiin

    తదుపరి వార్తలు