• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NITHIIN KEERTHY SURESH ROMANTIC DRAMA RANG DE MOVIE 1ST WEEKEND WORLDWIDE COLLECTIONS PK

Rang De 1st Weekend collections: ‘రంగ్ దే’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఈ జోరు సరిపోదు నితిన్..

నితిన్ రంగ్ దే (Rang De movie)

Rang De 1st Weekend collections: చెక్ (Check) లాంటి డిజాస్టర్ తర్వాత నితిన్ (Nithiin)నటించిన సినిమా రంగ్ దే (Rang De). వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ యావరేజ్‌గానే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. మూడు రోజుల తర్వాత చూస్తే వీకెండ్ బాగానే యూజ్ చేసుకుంది రంగ్ దే.

  • Share this:
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఎప్పుడూ తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. కాస్త కామెడీ.. మరికాస్త ఎమోషన్స్ కలిపి ఎలాంటి సినిమా చేసినా కూడా చూడ్డానికి సిద్ధంగానే ఉంటారు ఆడియన్స్. ఇప్పుడు నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన రంగ్ దే సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నిజానికి ఈ చిత్రానికి టాక్ మొదటి రోజే నెగిటివ్ వచ్చింది. రొటీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత చూస్తే కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించింది. మూడు రోజుల్లో డీసెంట్ వసూళ్లనే రాబట్టాడు నితిన్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ 12 కోట్లు షేర్ రాబట్టింది. కానీ లక్ష్యం 24 కోట్లు కావడంతో చాలా దూరం వెళ్లాల్సి ఉంది ఈ చిత్రం.

‘రంగ్ దే’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

నైజాం: 3.85 కోట్లు
వైజాగ్: 1.30 కోట్లు
సీడెడ్: 1.50 కోట్లు
ఈస్ట్: 85 లక్షలు
వెస్ట్: 58 లక్షలు
గుంటూరు: 1.09 కోట్లు
కృష్ణా: 53 లక్షలు
నెల్లూరు: 45 లక్షలు

ఏపీ, తెలంగాణ 3 రోజుల మొత్తం: 10.15 కోట్లు (15.22 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 65 లక్షలు
ఓవర్సీస్: 90 లక్షలు

మూడు రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 12.25 కోట్లు (19.60 కోట్ల గ్రాస్)
Published by:Praveen Kumar Vadla
First published: