Nithiin-Keerthy Suresh Rangde Twitter Review : రంగ్ దే సినిమా ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

Rangde Twitter Review Photo : Twitter

Nithiin-Keerthy Suresh Rangde Twitter Review : యువ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకుడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న రంగ్ దే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలవుతోంది.

  • Share this:
    యువ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకుడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న రంగ్ దే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలవుతోంది. చెక్ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారనుంది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో వచ్చిన చెక్ మంచి అంచనాలతో వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కంటే ముందు భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు నితిన్. ఇక భీష్మ, చెక్ తర్వాత నితిన్ హీరోగా వస్తున్న ఈ రంగ్ దే సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో మొదటి నుండి ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉంది. దీనికి తోడు కీర్తి సురేష్ గ్లామర్ అండ్ ఇమేజ్ కూడా సినిమాకు ఫ్లస్ అయ్యేలా ఉంది. ఇక దర్శకుడు వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రీవ్యూస్.. అటు ఓవర్సీస్‌లో షోస్ కూడా పడ్డాయి. మరీ ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు రంగ్ దే గురించి ఏమంటున్నారు. సినిమా కథేంటీ.. కథనం ఎలా ఉంది.. నితిన్ కీర్తి సురేష్‌ల రొమాన్స్ అండ్ కెమీస్ట్రీ వర్క్ అవుట్ అయ్యిందా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎలా మెప్పిస్తుంది. మొదలగు అంశాలను, సినిమా పట్ల తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. అవేంటో చూద్దాం..













    ఇక మరోవైపు సినిమాపై నమ్మకంతో ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాని సమాచారం. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు అండ్ జీ 5) దక్కించుకుందట. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం అందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తుండడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది.
    Published by:Suresh Rachamalla
    First published: