యువ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ్ దే మంచి అంచనాల నడుమ విడుదలై ఓకే అనిపించుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఈరోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో రంగ్ దే స్ట్రీమింగ్ అవుతోంది. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు అండ్ జీ 5) దక్కించుకుందని సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం అందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిచారు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరా మెన్‌గా పనిచేశారు. ఇక నితిన్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే సినిమా తర్వాత నితిన్ హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలూ ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేష్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.
ఇక ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. గతంలో వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య’ అంటూ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అనుకున్నంతగా అలరించలేదు. ఇక ఆ సినిమా తర్వాత వంశీ డైరెక్ట్ చేయనున్న సినిమా ఇదే. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వక్కంతం వంశీ కసిగా ఈ సినిమా కథను తయారు చేసుకున్నారట. లాంగ్ గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ కథను సిద్ధం చేసుకుని నితిన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో.. 'ఠాగూర్' మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేయనున్నారు నితిన్. ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్ ను పరిశీలిస్తోంది చిత్రబృందం. వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట వెంకీ. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో భీష్మ వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor nithin, Keerthy Suresh