Nithiin Range De release date: నితిన్ 'రంగ్‌దే'కు విడుద‌ల తేది ఖ‌రారు.. ఎప్పుడు రానున్నాడంటే.!

మార్చ్ 26: నితిన్ రంగ్ దే

నితిన్(Nithiin) హీరోగా వెంకీ అట్లూరీ(Venky Atluri) తెర‌కెక్కించిన చిత్రం రంగ్‌దే(Rang De). రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా.. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావించారు.

  • Share this:
    Nithiin Range De: నితిన్ హీరోగా వెంకీ అట్లూరీ తెర‌కెక్కించిన చిత్రం రంగ్‌దే. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా.. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావించారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ విడుద‌ల వాయిదా ప‌డ‌గా.. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేక‌ర్లు. మార్చి 26న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ప్రేమ, రొమాన్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో రంగ్‌దే మార్చి 26న మీ ముందుకు రానుంది అని వెంకీ అట్లూరీ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని కూడా విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్ నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

    కాగా ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే వ‌చ్చిన టీజ‌ర్, ఏమిటో ఇది అనే పాట అంద‌రినీ ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు కూడా ఏర్ప‌డ్డాయి. ఇక సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. లెజండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ ఈ మూవీ కోసం ప‌నిచేశారు. స్టార్ న‌టీన‌టులు, టాప్ టెక్నీషియ‌న్ల‌తో వ‌స్తోన్న ఈ మూవీతో త‌న భీష్మ స‌క్సెస్‌ని కంటిన్యూ చేస్తాన‌న్న ధీమాలో నితిన్ ఉన్నాడు.



    మ‌రోవైపు కీర్తికి సైతం ఈ మూవీపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. గ‌తేడాది కీర్తి న‌టించిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు ఓటీటీలో విడుద‌ల కాగా.. ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా మెప్పించ‌లేక‌పోయాయి. ఈ క్ర‌మంలో రంగ్‌దేతో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌ని కీర్తి చూస్తుంది. మ‌రి ఈ ఇద్ద‌రి కోరిక‌లు నెర‌వేర‌నున్నాయో..? లేదో..? తెలియాలంటే మార్చి వ‌ర‌కు ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published: