NITHIIN KEERTHY SURESH RANG DE MOVIE BUS STANDE SONG RELEASED AND IT GOES WELL PK
Nithiin Rang De song: పెళ్లి తర్వాత నితిన్ బతుకు బస్టాండ్ అయిపోయిందంట పాపం..!
నితిన్ రంగ్ దే సాంగ్ (Nithiin Rang De song)
Nithiin Rang De song: శుభమా అని పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ కావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు నితిన్ అదే అంటున్నాడు. తన బతుకు బస్టాండ్ అయిపోయిందంటూ డాన్సులు చేస్తూ పాడేసుకుంటున్నాడు.
శుభమా అని పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ కావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు నితిన్ అదే అంటున్నాడు. తన బతుకు బస్టాండ్ అయిపోయిందంటూ డాన్సులు చేస్తూ పాడేసుకుంటున్నాడు. ఈయన హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా రంగ్ దే. మార్చ్ 26న ఈ సినిమా విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. పి.డి.వి.ప్రసాద్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన రంగ్ దే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. బస్టాండే బస్టాండే అంటూ సాగే ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ పాడాడు. ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.
‘సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..
ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే
లవ్లీ గుండే కళలే.. లైఫే లేనిదాయే
స్మైలీ లాంటి ఫేసే.... స్మైలే లేనిదాయే’
అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాసాడు. నితిన్, కీర్తి సురేష్‌పై వచ్చే ఈ టీజింగ్ సాంగ్ అదిరిపోయే కొరియోగ్రఫీ చేసాడు శేఖర్. ఇందులో నితిన్ డాన్సులతో పాటు ఇల్లు తుడవడం.. అంట్లు తోమడం లాంటివి కూడా చేసి నవ్వించాడు. రంగ్ దే చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కూడా పెంచేసారు దర్శక నిర్మాతలు. మిస్టర్ మజ్ను ఫ్లాప్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా ఇది. మరోవైపు నితిన్ నటించిన చెక్ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో ఈయనకు కూడా రంగ్ దే విజయం కీలకంగా మారింది. ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండటం విశేషం.