• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NITHIIN KEERTHY SURESH RANG DE MOVIE 8 DAYS WORLDWIDE COLLECTIONS PK

Rang De 8 days collections: ‘రంగ్ దే’ 8 డేస్ కలెక్షన్స్.. నితిన్‌కు మరో ఫ్లాప్ తప్పదా..?

నితిన్ రంగ్ దే సాంగ్ (Nithiin Rang De song)

Rang De 8 days collections: అరణ్య (Aranya), తెల్లవారితే గురువారం సినిమాలు డిజాస్టర్ కావడంతో రంగ్ దే(Rang De)కు గతవారం కలిసొచ్చింది. ఈ చిత్రం తొలి 4 రోజుల్లో 14 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు నుంచి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

  • Share this:
చెక్ సినిమాతో నిరాశ పరిచిన నితిన్.. నెల తిరక్కుండానే మరో సినిమాతో వచ్చాడు. రంగ్ దే అంటూ కలర్ ఫుల్ సినిమా చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరీ తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో అ..ఆ, భీష్మ లాంటి విజయాల తర్వాత నితిన్ చేసిన సినిమా రంగ్ దే. ఈ సినిమా తొలి 4 రోజులు మంచి వసూళ్లు సాధించింది. దీనిజోరు చూసి కచ్చితంగా నితిన్ మరో విజయం అందుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే 4 రోజుల తర్వాత రంగ్ దే జోరు తగ్గిపోయింది. ఆరంభ శూరత్వమే అని తేలిపోయింది. సెలవులు లేకపోవడం.. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రంగ్ దే కలెక్షన్స్‌పై భారీ ప్రభావమే పడింది. ఇప్పటి వరకు 8 రోజుల రన్ పూర్తి చేసుకున్న రంగ్ దే.. 16 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగ్ దే సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి కానీ టార్గెట్ భారీగా ఉండటంతో నితిన్‌కు మరో ఫ్లాప్ తప్పేలా కనిపించడం లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 24 కోట్లు వసూలు చేయాలి.

‘రంగ్ దే’ 8 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్..

నైజాం: 5.57 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.71 కోట్లు
సీడెడ్: 2.08 కోట్లు
ఈస్ట్: 1.04 లక్షలు
వెస్ట్: 66 లక్షలు
గుంటూరు: 1.20 కోట్లు
కృష్ణా: 71 లక్షలు
నెల్లూరు: 51 లక్షలు

ఏపీ, తెలంగాణ 8 రోజుల మొత్తం: 13.87 కోట్లు (22.12 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 75 లక్షలు
ఓవర్సీస్: 1.76 కోట్లు

8 రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 16.02 కోట్లు (27.60 కోట్ల గ్రాస్)

ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు మరో 8 కోట్ల దూరంలో ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ చిత్ర వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దాంతో నితిన్ సినిమా 8 కోట్లు వసూలు చేస్తుందనుకోవడం అత్యాశే. వైల్డ్ డాగ్, సుల్తాన్ లాంటి సినిమాలు రావడంతో నితిన్ సినిమాపై ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఎలా చూసుకున్నా కూడా నితిన్‌కు రంగ్ దే రూపంలో మరోసారి నిరాశ తప్పలేదు.
Published by:Praveen Kumar Vadla
First published: