• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NITHIIN KEERTHY SURESH RANG DE MOVIE 4 DAYS WORLDWIDE COLLECTIONS HERE THE FULL AREA WISE REPORT PK

Rang De 4 days WW collections: ‘రంగ్ దే’ 4 రోజుల కలెక్షన్స్.. హోలీ రోజు నితిన్ హవా..

నితిన్ రంగ్ దే (Rang De movie)

Rang De 4 days WW collections: అరణ్య (Aranya), తెల్లవారితే గురువారం సినిమాలు డిజాస్టర్ కావడంతో రంగ్ దే(Rang De)కు కలిసొచ్చింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 12 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు హోలీ సెలవు రోజు రావడంతో మంచి కలెక్షన్స్ రాబట్టింది. 4వ రోజు దాదాపు 1.56 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది రంగ్ దే.

  • Share this:
నితిన్, కీర్తి సురేష్ జంటగా కుర్ర దర్శకుడు వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వచ్చిన రంగ్ దే తొలి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కొత్తదనం లేదు.. అదే పాత కథనే మళ్లీ తీసాడంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. అయితే ఈ చిత్రంతో పాటు వచ్చిన అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు డిజాస్టర్ కావడంతో రంగ్ దేకు కలిసొచ్చింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 12 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు హోలీ సెలవు రోజు రావడంతో మంచి కలెక్షన్స్ రాబట్టింది. 4వ రోజు దాదాపు 1.56 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది రంగ్ దే. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నితిన్ సినిమాకు ఇంకా 10 కోట్ల లక్ష్యం బాకీ ఉంది. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రంగ్ దే సినిమా 13.85 కోట్లు వసూలు చేసింది.

‘రంగ్ దే’ 4 రోజుల కలెక్షన్స్..

నైజాం: 4.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.51 కోట్లు
సీడెడ్: 1.76 కోట్లు
ఈస్ట్: 92 లక్షలు
వెస్ట్: 66 లక్షలు
గుంటూరు: 1.20 కోట్లు
కృష్ణా: 60 లక్షలు
నెల్లూరు: 46 లక్షలు

ఏపీ, తెలంగాణ 4 రోజుల మొత్తం: 11.55 కోట్లు (18.22 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 68 లక్షలు
ఓవర్సీస్: 1.62 కోట్లు

4 రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 13.85 కోట్లు (23.60 కోట్ల గ్రాస్)
Published by:Praveen Kumar Vadla
First published: