Nithin : షూటింగ్‌కు రెడీ అవుతోన్న నితిన్.. నవంబర్ నుండి షురూ..

Nithin : యువ హీరో నితిన్ వరుసగా సినిమాలకు ఓకే చెప్తున్నాడు. ప్రస్తుతం ఆయన రంగ్ దే‌లో నటిస్తున్నాడు.

news18-telugu
Updated: October 7, 2020, 7:05 AM IST
Nithin : షూటింగ్‌కు రెడీ అవుతోన్న నితిన్.. నవంబర్ నుండి షురూ..
నితిన్ Photo : Twitter
  • Share this:
యువ హీరో నితిన్ వరుసగా సినిమాలకు ఓకే చెప్తున్నాడు. ప్రస్తుతం ఆయన రంగ్ దే‌లో నటిస్తున్నాడు. ఇక నితిన్ ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు. భీష్మ హిట్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రం రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అంతే కాదు ఎప్పుడో జూలైలో విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడంతో రంగ్ దే టీమ్ షూటింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ రెస్యూమ్ చేసిన తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేస్తోందట.

ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చెక్‌’ అనే పేరును ఖరారు చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ యేలేటి మాట్లాడుతూ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ కథ ఇది. చదరంగం నేపథ్యంలో సాగుతుందన్నారు. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు సాగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వీటితో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది.

త్వరలోనే ‘రంగ్ దే’ షూటింగ్ ముగియనుండటంతో ఈ రీమేక్ చిత్రం ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది టీమ్. ఆ సన్నాహకాల్లో భాగంగానే మేర్లపాక గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ కలిసి లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. చిత్రాన్ని వీలైనంతవరకూ సహజ సిద్ధమైన లొకేషన్లలోనే చిత్రీకరించాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: October 7, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading