నితిన్ సినిమా బడ్జెట్ అంతనా.. భయపడుతోన్న ఫ్యాన్స్..

భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నాడు.

news18-telugu
Updated: May 10, 2020, 11:21 AM IST
నితిన్ సినిమా బడ్జెట్ అంతనా.. భయపడుతోన్న ఫ్యాన్స్..
నితిన్ Photo : Twitter
  • Share this:
భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నాడు. అందులో భాగంగా ఆయన వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే సినిమాతో పాటు.. చంద్రశేఖర్ ఏలేటి సినిమా.. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధధూన్ తెలుగు రీమేక్ సినిమాలున్నాయి. ఈ మూడు సినిమాల తర్వాత తాజాగా మరో భారీ సినిమాకు నితిన్ కమిట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే నితిన్ చల్ మోహనరంగా సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాకు సై అన్నాడు. ఈ సినిమా పవర్ పేట పేరుతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని సమాచారం. అందులో భాగంగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 90 కోట్లకు పైబడే ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయం నితిన్ అభిమానులకు సంతోషం కలిగించగా.. భయాన్ని కలిగిస్తోందట. నితిన్ సినిమాలు మీడియం బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. ఇప్పటివరకు నితిన్ హైయెస్ట్ గ్రాసర్‌గా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ.. ఉంది. ఈ నేపథ్యంలో ఒక సినిమాపై 90 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది చాలా రిస్క్ అని సినీ పండితులు అభిప్రాయం. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే మాత్రం చిత్రబృందం స్పందించాల్సిందే.
Published by: Suresh Rachamalla
First published: May 10, 2020, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading