కరోనా కష్టాలు అందర్నీ భయపెడుతున్నాయి. ఇప్పుడు హీరో నితిన్ పెళ్లికి కూడా ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పటికే ఎలాగోలా దిల్ రాజు, నిఖిల్ లాంటి వాళ్లు కరోనా కాలంలోనే పెళ్లి చేసుకున్నారు. కానీ నితిన్ మాత్రం అలా కాదంటున్నాడు. తన పెళ్లి అనుకున్నట్లుగానే ఘనంగా జరగాలని భావిస్తున్నాడు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ అభిమానుల సమక్షంలో చేసుకోవాలని ఆశిస్తున్నాడు. నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఈ జంట దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)
దీనికి ఏర్పాట్లు కూడా భారీగానే జరిగాయి. అయితే ఇప్పుడు ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ పెళ్ళిని కొన్ని రోజులుగా పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కాకుండా ఏకంగా ఆర్నెళ్ల పాటు నితిన్ పెళ్లి వాయిదా వేయాలని భావిస్తున్నారు కుటుంబ సభ్యులు. డిసెంబర్లో ఈయన పెళ్లి జరపాలని చూస్తున్నారు వాళ్లు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుందని ప్రచారం జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.