Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: February 6, 2020, 10:52 PM IST
జయం సినిమా రీమేక్ (Jayam Movie)
కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు.. ఎన్నేళ్లైనా కూడా వాటికి అలాంటి క్రేజ్.. ఇమేజ్ ఉంటుంది. అలాంటి ఓ సంచలన సినిమా జయం. నితిన్ హీరోగా పరిచయమైన ఈ చిత్రాన్ని తేజ తెరకెక్కించాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ కెరీర్‌కు అదిరిపోయే పునాది వేసింది జయం. ఇక గోపీచంద్ కెరీర్ కూడా మారిపోయింది ఈ చిత్రంతోనే. తొలివలపు సినిమాతో హీరోగా వచ్చి ఫ్లాప్ అయిన సమయంలో జయం సినిమాలో ఆఫర్ ఇచ్చాడు తేజ. ఈ చిత్రంతో విలన్‌గా స్టార్ అయిపోయాడు ఈయన. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ చిత్రం జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్ అయింది.

జయం సినిమా రీమేక్ (Jayam Movie)
అక్కడ కూడా సంచలనం విజయం సాధించింది. తమిళనాట ఆర్బి చౌదరి తనయుడు రవి హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసారు. ఈ చిత్రంతో జయం రవి అయిపోయాడు ఈ హీరో. ఇక మిగిలిన భాషల్లో కూడా జయం సినిమాను రీమేక్ చేసారు. ఇప్పుడు కన్నడలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ ఈ చిత్రంతో పరిచయం కావాలని చూస్తున్నాడు. కొత్త హీరోకు జయం లాంటి కథ మళ్లీ దొరకదు. అందుకే ఇన్నేళ్ళ తర్వాత కూడా జయంకు క్రేజ్ తగ్గలేదు. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు ప్రవీణ్ కుమార్. మరి చూడాలిక.. జయం కన్నడ వర్షన్ 18 ఏళ్ళ తర్వాత ఏం మాయ చేస్తుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
February 6, 2020, 10:52 PM IST