NITHIIN DEBUT MOVIE JAYAM TO BE REMADE IN KANNADA AFTER 18 YEARS OF RELEASE PK
జయం సినిమా రీమేక్.. 18 ఏళ్ళ తర్వాత ఆ భాషలోకి..
జయం సినిమా రీమేక్ (Jayam Movie)
Nithiin Jayam: కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు.. ఎన్నేళ్లైనా కూడా వాటికి అలాంటి క్రేజ్.. ఇమేజ్ ఉంటుంది. అలాంటి ఓ సంచలన సినిమా జయం. నితిన్ హీరోగా పరిచయమైన..
కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు.. ఎన్నేళ్లైనా కూడా వాటికి అలాంటి క్రేజ్.. ఇమేజ్ ఉంటుంది. అలాంటి ఓ సంచలన సినిమా జయం. నితిన్ హీరోగా పరిచయమైన ఈ చిత్రాన్ని తేజ తెరకెక్కించాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ కెరీర్‌కు అదిరిపోయే పునాది వేసింది జయం. ఇక గోపీచంద్ కెరీర్ కూడా మారిపోయింది ఈ చిత్రంతోనే. తొలివలపు సినిమాతో హీరోగా వచ్చి ఫ్లాప్ అయిన సమయంలో జయం సినిమాలో ఆఫర్ ఇచ్చాడు తేజ. ఈ చిత్రంతో విలన్‌గా స్టార్ అయిపోయాడు ఈయన. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ చిత్రం జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్ అయింది.
జయం సినిమా రీమేక్ (Jayam Movie)
అక్కడ కూడా సంచలనం విజయం సాధించింది. తమిళనాట ఎడిటర్ మోహన్ తనయుడు రవి హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసారు. ఈ చిత్రంతో జయం రవి అయిపోయాడు ఈ హీరో. ఇక మిగిలిన భాషల్లో కూడా జయం సినిమాను రీమేక్ చేసారు. ఇప్పుడు కన్నడలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ ఈ చిత్రంతో పరిచయం కావాలని చూస్తున్నాడు. కొత్త హీరోకు జయం లాంటి కథ మళ్లీ దొరకదు. అందుకే ఇన్నేళ్ళ తర్వాత కూడా జయంకు క్రేజ్ తగ్గలేదు. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు ప్రవీణ్ కుమార్. మరి చూడాలిక.. జయం కన్నడ వర్షన్ 18 ఏళ్ళ తర్వాత ఏం మాయ చేస్తుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.