నితిన్ ఆ ద‌ర్శ‌కుడితో సాహ‌సం.. ఒకేసారి రెండు సినిమాలు..

శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌ర్వాత ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు నితిన్. వ‌ర‌స సినిమాలు క‌మిట్ అవుతున్నాడు కానీ ఒక్క‌టి కూడా సెట్స్ పైకి రాలేదు. దాంతో ఈ మ‌ధ్యే అభిమానుల‌కు ఓ లేఖ కూడా రాసాడు ఈ కుర్ర హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 21, 2019, 5:40 PM IST
నితిన్ ఆ ద‌ర్శ‌కుడితో సాహ‌సం.. ఒకేసారి రెండు సినిమాలు..
నితిన్ ఫైల్ ఫోటో (Nithiin Engagement)
  • Share this:
శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌ర్వాత ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు నితిన్. వ‌ర‌స సినిమాలు క‌మిట్ అవుతున్నాడు కానీ ఒక్క‌టి కూడా సెట్స్ పైకి రాలేదు. దాంతో ఈ మ‌ధ్యే అభిమానుల‌కు ఓ లేఖ కూడా రాసాడు ఈ కుర్ర హీరో. త్వ‌ర‌లోనే తాను రెండు సినిమాలు ప్ర‌క‌టిస్తాన‌ని.. అన్నీ ఇప్పుడు చివ‌రి స్టేజీలో ఉన్నాయ‌ని చెప్పాడు. అన్న‌ట్లుగానే మార్చ్ నెలాఖ‌రులో రెండు సినిమాలు ప్ర‌క‌టించాడు ఈ హీరో. చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో తాను ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ట్వీట్ చేసాడు నితిన్. చాలా రోజులుగా ఈ చిత్రం చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది.
గోపీచంద్, సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంటి హీరోల‌కు కూడా ఈ క‌థ‌ను చెప్పినా చివ‌రికి నితిన్ ద‌గ్గ‌ర ఆగింది. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తాడని క్లారిటీ ఇచ్చాడు నితిన్. ఈ చిత్రంతో పాటు ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కూడా చేయ‌డానికి నితిన్ ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. వీర‌, ఒక ఊరిలో, రైడ్ లాంటి సినిమాలు తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఈ కుర్ర హీరో.

Nithiin Confirms his next movie with versatile director Chandrasekhar Yeleti along with Bheeshma pk.. శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌ర్వాత ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు నితిన్. వ‌ర‌స సినిమాలు క‌మిట్ అవుతున్నాడు కానీ ఒక్క‌టి కూడా సెట్స్ పైకి రాలేదు. దాంతో ఈ మ‌ధ్యే అభిమానుల‌కు ఓ లేఖ కూడా రాసాడు ఈ కుర్ర హీరో. nithiin twitter,nithin twitter,nithin chandrasekhar yeleti movie,nithiin chandrasekhar yeleti movie,nithiin bheeshma movie,nithin bheeshma movie,nithiin venky kudumula,nithiin ramesh varma movie,telugu cinema,నితిన్,నితిన్ ట్విట్టర్,నితిన్ చంద్రశేఖర్ యేలేటి,నితిన్ రమేష్ వర్మ,నితిన్ భీష్మ సినిమా,నితిన్ వెంకీ కుడుముల సినిమా
నితిన్ చంద్రశేఖర్ యేలేటి


ఇక దాంతో పాటు ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తో కూడా భీష్మ‌ సినిమా చేస్తున్నాడు ఈయ‌న‌. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించ‌నుంది. మొత్తానికి 2019లో క‌చ్చితంగా రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు నితిన్. వీటితో పాటు ఇక‌పై వ‌ర‌స‌గా సినిమాలు చేస్తాన‌ని.. బ్రేక్ తీసుకోనంటూ హామీ ఇస్తున్నాడు ఈ హీరో. మ‌రి అన్న మాట ప్ర‌కారం వ‌ర‌స సినిమాలు చేస్తాడో లేదో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: March 21, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading