• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NITHIIN CHANDRASEKHAR YELETI RAKUL PREET SINGH PRIAY PRAKASH VARRIER CHECK TWITTER REVIEW SR

Nithiin Check: నితిన్-చంద్రశేఖర్ యేలేటి చెక్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Nithiin Check: నితిన్-చంద్రశేఖర్ యేలేటి చెక్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Nithiin Check twitter review Photo : Twitter

Nithiin Check: యువ హీరో నితిన్‌, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తాజా చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించాడు.

  • Share this:
    యువ హీరో నితిన్‌, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తాజా చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించాడు. నితిన్ ఈ సినిమాలో ఖైదీగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలకానుంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై  వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించాడు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉండి ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు.  ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ రకుల్, ప్రియా ప్రకాష్‌లతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌, హర్షవర్థన్‌, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి కనిపించనున్నారు. గత కొంత కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ అందించాడు. అయితే సినిమాలో కథానుగుణంగా ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరిందని.. దీంతో ఒక్క పాటను మాత్రమే పెట్టాల్సి వచ్చిందని.. అంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇలా నితిన్ సినిమాలో ఒకే సాంగ్ ఉండడం మొదటిసారి. ఇది ఆయనకు ఓ ఎక్స్‌పరిమెంట్ లాంటిదే.. చూడాలి మరి ఎలా ఉండనుందో..

    మరోవైపు గతంలో నితిన్ ఏ సినిమాకు లేనట్టు ఈ సినిమాపై పాజిటివ్ బజ్ మొదటినుంచి ఉంది. ఇక ఈ  సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. కరోనా కారణంగా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో దాదాపు రూ. 15 కోట్ల మేరకు బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటక, మిగతా దేశం, ఓవర్సీస్ మొత్తం కలిపి రూ. 1.1 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 16.5 కోట్ల బిజినెస్ చేసింది. ఇక చెక్ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 16.5 కోట్లను రాబట్టాలి. నితిన్ గత సినిమాల కలెక్షన్స్ చూస్తే.. ఈ టార్గెట్ పెద్ద విషయం కాదంటున్నారు. టాలీవుడ్ పండితులు..

    ఈ సినిమా ఈ నెల 26న అంటే ఈరోజు విడుదలవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. చెక్ కథేంటీ, నితిన్ యాక్టింగ్ ఎలా ఉంది.. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా.. కథనం ఎలా ఉంది మొదలగు అంశాల గూర్చి చర్చిస్తున్నారు అవేంటో చూద్దాం..














    ట్విట్టర్‌‌లో నెటిజన్స్ కామెంట్స్ బట్టిచూస్తే నితిన్‌కు మరో హిట్ గ్యారెంటీ అని తెలుస్తోంది. ఎక్కువ శాతం నెటిజన్స్ సినిమా గురించి పాజిటివ్ టాక్  ఇస్తున్నారు. సో నితిన్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే.

    ఇక నితిన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్న నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాతో పాటు హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published: