నితిన్ మ‌రోటి మొద‌లుపెట్టాడు.. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఏం చేస్తాడో మ‌రి..?

విభిన్న‌మైన సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఈయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధిస్తుంద‌నే గ్యారెంటీ లేక‌పోయినా ప్ర‌శంస‌లు మాత్రం క‌చ్చితంగా వ‌స్తాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 23, 2019, 3:01 PM IST
నితిన్ మ‌రోటి మొద‌లుపెట్టాడు.. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఏం చేస్తాడో మ‌రి..?
విలక్షణ సినిమాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి కూడా ఫ్లాపుల్లో ఉన్నా కూడా నితిన్ అవకాశం ఇచ్చాడు.
  • Share this:
విభిన్న‌మైన సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఈయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధిస్తుంద‌నే గ్యారెంటీ లేక‌పోయినా ప్ర‌శంస‌లు మాత్రం క‌చ్చితంగా వ‌స్తాయి. ఈయ‌న గ‌త సినిమా మ‌నమంతా కూడా ఇలాగే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. అద్భుత‌మైన స్క్రీన్ ప్లేతో యేలేటి చేసిన మ్యాజిక్ బాగానే వ‌ర్క‌వుట్ అయింది. అయితే డ‌బ్బులు మాత్రం రాలేదు. మూడేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమా మొద‌లుపెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. కుర్ర హీరో నితిన్‌తో ఈ సినిమా వ‌ర్క‌వుట్ చేసాడు.
Nithiin, Chandrasekhar Yeleti new movie opened in grand style and actor romance with Rakul, Priya Varrier pk.. విభిన్న‌మైన సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఈయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధిస్తుంద‌నే గ్యారెంటీ లేక‌పోయినా ప్ర‌శంస‌లు మాత్రం క‌చ్చితంగా వ‌స్తాయి. nithiin,nithiin twitter,nithiin new movie,nithiin rakul preet singh,nithiin priya varrier,chandra sekhar yeleti,chandrasekhar yeleti,nithin new movie,chandra sekhar yeleti new movie,rana daggubati chandra sekhar yeleti movie,sahasam movie,chandra sekhar yeleti movies,nithiin new movie with chandrashekar yeleti,nithin in chandra shekar yeleti movie,nithin next movie,chandrashekar yeleti new movie with nithiin,nithin chandrashekar yeleti,chandrashekar yeleti movies,nithin with chandrashekar yeleti,telugu cinema,నితిన్,నితిన్ చంద్రశేఖర్ యేలేటి,నితిన్ రకుల్,నితిన్ ప్రియా వారియర్,తెలుగు సినిమా
నితిన్ న్యూ మూవీ ఓపెనింగ్

గోపీచంద్, సాయి ధ‌ర‌మ్ తేజ్, నాగ‌చైత‌న్య లాంటి హీరోల‌తో ప్లాన్ చేసినా కూడా ఏదీ వ‌ర్క‌వుట్ కాక‌పోయేస‌రికి చివ‌రికి నితిన్ సెట్ అయ్యాడు. ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా మొద‌ల‌య్యాయి. భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌చ్చితంగా ఈ చిత్రంతో నితిన్ కూడా విజ‌యాన్ని అందుకుంటార‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. వ‌ర‌స ఫ్లాపుల‌తో డీలా ప‌డిన నితిన్ కెరీర్‌కు ఈ చిత్రం కీల‌కంగా మారింది.
Published by: Praveen Kumar Vadla
First published: June 23, 2019, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading